
బిఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్…
నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)త్వరలో జరగనున్న ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంటరీ అభ్యర్థిగా బారాస తరుపున పోటీ చేస్తున్న వినోద్ కుమార్ అత్యధిక మెజారిటీ తో విజయం సాధిస్తాడని బీఆరెస్వి రాష్ట్ర అధ్యక్షుడు,మాజీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గె ల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు.మండల కేంద్రంలో గురువారం జరిగిన ఒక వివాహా వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ వినోద్ కుమార్ విజయాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని,ప్రస్తుత పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ నియోజక వర్గ అభివృద్ధి నీ పట్టించుకోలేదని,కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వున్న నియోజక వర్గ అబివృద్దికి ఏ మాత్రం నిధులు తీసుకురాలేదు అని విమర్శించారు.రాష్ట్ర ములో కల్లి బొల్లి మాటలతో అధికారం చే పట్టిన కాంగ్రెస్స్ ప్రభుత్వం వంద రోజుల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని,అన్ని వర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారని,పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సర్కారుకు తెలంగాణ ప్రజలు తగు గుణపాఠం చెబుతారని విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమములో సింగిల్ విండో చైర్మన్ పేరాల సంపత్ రావు,వైస్ చైర్మన్ ఇంద్రసెనారెడ్డి,తక్కల్ల పల్లి సత్యనారాయణ రావు,మారపెళ్లి నవీన్,లాందిగే లక్ష్మణ్ రావు,తడక శ్రీకాంత్,పలువురు నాయకులు పాల్గొన్నారు.