
కాంగ్రెస్ గెలుపును ఎవరు అడ్డుకోలేరు
నాడు రేవంత్ రెడ్డి కి ఇచ్చిన మెజారిటీని.. నేడు సునీత మహేందర్ రెడ్డి కి ఇవ్వాలి
కార్యకర్తల సమావేశంలో మంత్రి తుమ్మల
ఉప్పల్ నేటిధాత్రి మార్చ్ 28
మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి అడ్డాగా తెలిపారు. గత లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్ రెడ్డికి భారీ మెజార్టీని ఇచ్చి ఘనత ఇక్కడి ఓటర్లకు ఉందన్నారు.
గతంలో రేవంత్ రెడ్డి వలె ఇప్పుడు సునీత మహేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని తుమ్మల పిలుపునిచ్చారు.
ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉప్పల్ లోని శ్రీరస్తు ఫంక్షన్ హాల్ లో
నియోజకవర్గ స్థాయి సమావేశానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి విచ్చేసి మాట్లాడారు.
ప్రతి నాయకుడు కార్యకర్త ఎన్నికల వరకు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా మంత్రి తుమ్మల గుర్తు చేశారు. అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.
మల్కాజిగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు.
కార్యక్రమంలో మేడ్చెల్ జిల్లాకాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగరెడ్డి హరివర్ధన్‌రెడ్డి
,ఉప్పల్ ,చెర్లపల్లి,కాప్రా కార్పొరేటర్లు మందముల రజితాపరమేశ్వర్‌రెడ్డి, బొంతు శ్రీదేవి ,స్వర్ణరాజ్ శివమణి
,టీపీసీసీ ప్రతినిది తొఫిక్ ,ఆగి రెడ్డి ,మాజీ కార్పొరేటర్ పావని రెడ్డి ,సింగి రెడ్డి ధన్ పాల్ రెడ్డి
,అంజి రెడ్డి , కృష్ణా రెడ్డి ,సీత రామ్ రెడ్డి , రామ్ రెడ్డి ,జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రవణ్ రెడ్డి ,ఉప్పల్ అధ్యక్షులు ఆకారపు అరుణ్ ,లింగంపల్లి రామకృష్ణ ,సుర్వి మురళి గౌడ్ , తవిడబోఈన గిరిబాబు , పత్తి కుమార్ ,చెన్ రెడ్డి రఘుపతి రెడ్డి,ఉమేష్ గౌడ్ ,బజారు జగన్ నాథ్ గారు,తెల్కల మోహన్ రెడ్డి, అమరేశ్వరి , వెంకటేశ్వర్ రెడ్డి డివిజన్ అధ్యక్షులు రఫీక్ ,బాకారం లక్ష్మణ్ ,శ్రీకాంత్ గౌడ్ ,విజయ్ ,సింగి రెడ్డి వెంకట్ రెడ్డి ,నాగశేషు ,లూకాస్ ,గరిక సుధాకర్ ,అంజయ్య ,ఆగం రెడ్డి ,తుమ్మల దేవి రెడ్డి ,ఈగ ఆంజనేయులు ,పాశికంటి నాగరాజ్ ,శ్రీనివాస్ యాదవ్ ,మాజీ కౌన్సిలర్ రాజేందర్ ,బల్ రెడ్డి ,ప్రభు ,రాజేష్ ముదిరాజ్ ,వల్లపు శ్రీకాంత్ యాదవ్ ,పెద్ది సీను ,పోచయ్య ,పేట మురళి ముదిరాజ్ ,బిల్లకంటి యాదయ్య ,బాలయ్య బాబు ,గోపాల్ యాదవ్ ,తదితరులు పాల్గొన్నారు.