
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో ఇటీవల మరణించిన జంగ బుజ్జమ్మ కుటుంబానికి ప్రఘాడ సానుభూతి తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోమ్మరవెని తిరుపతి ముదిరాజ్ ఆధ్వర్యంలో బుజ్జమ్మ కుటుంబానికి ఇరవైఐదు కేజీల బియ్యం, వంటనూనెను అందించడం జరిగింది. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజాల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ వడ్లూరి రాజేందర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నీలం చిన్న ముదిరాజ్, పొన్నం సత్తయ్య, కాంపల్లి రాజు, తదితరులు పాల్గొన్నారు.