
బల్దియా అధికారులకు కాలనీ వాసుల విజ్ఞప్తి
నేటిధాత్రి, వరంగల్
వరంగల్ 12వ డివిజన్ పరిధిలోని 100ఫీట్ల రోడ్డులో, కొందరు వ్యక్తులు రోడ్డు కబ్జా చేశారని కాలనీ వాసులు మీడియాతో మాట్లాడారు. 100 ఫీట్ల రోడ్డు పక్కన కాలనీకి వెళ్ళే దారి కబ్జా చేశారని, వెనకాల ఉండే కాలనీ కుటుంబాలు చేసిన పిర్యాదు మేరకు స్పందించిన మున్సిపల్ అధికారులు. అక్రమ కట్టడం కూల్చివేతకై అధికారులు జెసిబితో రాగా, కబ్జాదారులు పెద్ద ఎత్తున గుమిగూడి, ఇదేంటి అని అడిగిన వారిపైన, మున్సిపల్ అధికారులపై మనుషుల్ని తీసుకువచ్చి బెదిరించినట్లు బాధితులు మీడియాతో తెలిపారు. ఎనుమాముల పోలీసు అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. గతంలో రెండు సార్లు 100 ఫీట్ల రోడ్డుకు గల దారిని కబ్జా చేసిన విషయం తెలుసుకున్న కాలనీ వాసులు పిర్యాదు చేశారు, పిర్యాదు మేరకు మున్సిపల్ అధికారులు కూల గొట్టి వెళ్ళారని అని అన్నారు. మళ్ళీ రాత్రికి రాత్రే గోడలు కట్టి దానికి తోడు అక్రమంగా బిల్డింగ్ పెర్మిషన్ తెచ్చుకొని ఇబ్బందులకు గురి చేస్తున్న కబ్జారాయుల్ల పైన చర్య తీసుకోవాలని స్థానికుల డిమాండ్. జాగకు సంబంధం లేని వ్యక్తులను, కూలీ పని చేస్తున్న వారిని తెచ్చి అక్కడ నిలబెట్టి వచ్చిన మున్సిపల్ అధికారులను పని చేయకుండా అడ్డుకుంటున్న కబ్జారాయుల్ల పైన చర్యలు తీసుకోవాలని, లేని యెడల వరంగల్ పోలీస్ కమిషనర్ కు పిర్యాదు చేస్తాం అని కాలనీ వాసులు తమ ఆవేదన వ్యక్తంచేశారు. కబ్జా నిర్మాణం తొలగించి రోడ్డు ఉండేలా చేస్తారా లేదా అనేది వేచి చూడాలి.