
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల *సాగునీటి శాశ్వత పరిష్కారం చూపుతుంది!!
రైతుల సాగునీటి కోసం పంప్ హౌస్ నుండి నీటిని విడుదల చేయించిన ప్రభుత్వ విప్ అడ్లూరీ లక్ష్మణ్ కుమార్
ఎండపల్లి నేటి ధాత్రి
గత ప్రభుత్వం రైతులను ఏనాడు పట్టించుకోలేదు అని,
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సాగునీటికి శాశ్వత పరిష్కారం చూపుతుంది అని
రైతుల సాగునీటి కోసం పంప్ హౌస్ నుండి నీటిని విడుదల చేయించిన సందర్భంగా ప్రభుత్వ విప్ ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ అన్నారు, జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం వేమునూర్ పంప్ హౌస్ నుండి సాగునీటి కోసం పంటలు ఎండిపోతున్నాయని రైతుల విజ్ఞప్తి మేరకు పంటల కొరకు సాగునీటిని ప్రభుత్వం ధర్మపురి శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ వేమునూర్ పంప్ హౌస్ నుండి నీటిని విడుదల చేయించారు, ఈ సందర్భంగా రైతులు ప్రభుత్వ విప్ అడ్డురీ లక్ష్మణ్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు, ఈ కార్యక్రమంలో ఉమ్మడి వెల్గటూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిసిసి కార్యవర్గ సభ్యులు శైలెందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గెల్లు శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు