
మృతి చెందిన పాలసీదారుని కుటుంబానికి రూ 5,87,000
జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన కొయ్యడ దేవేంద్ర శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ రూ32710 తో పాలసీని ఏజెంట్ బొద్దున రమేష్ ద్వారా పాలసీ తీసుకున్న రెండు నెలల కాల పరిమితి లోనే గుండెపోటుతో మృతి చెందినాడు. మృతుడి కుమారుడు అయినా కొయ్యడ రాజకుమార్ నామినిగా ఉండడంతో ఇన్సూరెన్స్ సిబ్బంది వారు పాలసీ యొక్క మొత్తం భీమా నగదు రూ5,87,250 చెక్కును టేకుమట్ల గ్రామపంచాయతీ ఆవరణలోమాజీ సర్పంచ్ గోనె సుమలత నరసయ్య సమక్షంలో అందజేసినారు.ఈ సందర్భంగా శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏజీఎం అట్లా సురేష్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ పాలసీలు అవసరమని పేర్కొన్నారు. సంపాదించే వ్యక్తిలు ఏ కారణం చేత అయిన చనిపోతే కుటుంబాలకు అండగా ఉండడమే కాకుండా భీమా పాలసీలు చేయించుకున్న వ్యక్తులు మరణించిన తర్వాత కూడా కుటుంబీకులకు పాలసీ నగదును ఆసరాగా లబ్ది చేకూరేలా చేయవచ్చునని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి బ్రాంచ్ మేనేజర్ వెంకట్ రాజం, మంచిర్యాల్ బ్రాంచ్ మేనేజర్స్ రాజు స్వాతి, ఎగ్జిక్యూటివ్స్ నూనె ప్రశాంత్ మహేందర్ ,డి ఓ వడ్లకొండ వివేక్,డి ఓ చంద్రమౌళి ఏజెంట్ లలిత మాజీ సర్పంచ్ సర్పంచ్ గోనె సుమలత నరసయ్య, కో ఆప్షన్ మెంబర్ బల్ల రాజెల్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.