
శాయంపేట నేటి ధాత్రి;
శాయంపేట మండలం చేనేత సహకార సంఘానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పర్యటించారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఈ ప్రభుత్వం చేయదు.సంఘం యొక్క నష్టాలు ,మార్కెటింగ్ చేసే విధానం మరియు కార్మికుల కొరత తెలుసుకున్నాడు. ప్రతి కార్మికుడి యొక్క కష్ట నష్టాన్ని అడిగి తెలుసుకుని అప్పులో ఉన్న సంఘానికి చేయూత నిస్తానని చేనేత మంత్రి తుమ్మలపల్లి నాగేశ్వరరావు దగ్గరికి తీసుకునిపోయి మీ సమస్యలను ఎన్నికల తర్వాత పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఇల్లు లేని చేనేత కార్మికునికి ఇందిరమ్మ పథకం అమలు చేస్తామని అంతేకాకుండా మీ యొక్క వస్త్రాలను ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో చేనేత సిబ్బంది కాంగ్రెస్ నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.
ఆరు గ్యారెంటీల అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యం
కేక్ కట్ చేసి సంబరాలు
శాయంపేట మండలం కేంద్రంలో కూడలి వద్ద ఆరుగ్యారంటీల అమలు చేస్తున్న ప్రభుత్వం అనుగుణంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు అధిక మొత్తంలో పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీలోకి వలసల పర్వం
శాయంపేట మండలం నేరేడుపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. స్థానిక ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు గ్రామ అధ్యక్షుడు మోత్కూరి భాస్కర్ నాయకులు ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొన్నారు.