
నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హుజూరాబాద్ శాసన సభ నియోజక వర్గ పరిదిలోగల కమలాపూర్ మండలము లోని పోలింగ్ స్టేషన్ లను హుజురాబాద్ ఆర్డీఓ రమేష్ బాబు పరిశీలించారు.మండల కేంద్రం కమలాపూర్ తో పాటు ఉప్పల్ గ్రామాల్లో గల పాఠశాల భవనాలు,పోలింగ్ స్టేషన్ లను స్థానిక తహశీల్దార్ తో కలిసి పరిశీలించారు.ఓటర్ల కు ఇబ్బందులు కలగ కుండా అన్ని ఏర్పాట్లు చేయాలని,నిరంతర విద్యుత్,మంచి నీటి సౌకర్యం కల్పించాలని,ఎండాకాలం దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమములో రెవెన్యూ ఇన్స్పెక్టర్ అశోక్ రెడ్డి,పాఠశాల ల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.