
వేములవాడ,నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని వరంగల్ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ డిఐజి సుభాషిణి మంగళవారం తనిఖీ చేశారు. కార్యాలయంలోని రికార్డు రూమును, కంప్యూటర్ విభాగాన్ని, పలు రికార్డులను పరిశీలించారు. రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వచ్చిన ప్రజలతో మాట్లాడి ఏమైనా ఇబ్బందులు ఉంటే సబ్ రిజిస్టర్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని, వార్షిక తనిఖీల్లో భాగంగా కార్యాలయాన్ని తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు. ఆమె వెంట సబ్ రిజిస్టర్ చెర్ల సురేంద్రబాబు, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.