
చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని పెరకవాడ 3వ అంగన్వాడీ సెంటర్లో మంగళవారం పోషణ పక్వాడ్ లో భాగంగా 6 నెలలు నిండిన పిల్లలకు అన్న ప్రసాన కార్యక్రమం నిర్వహించారు. పిల్లలకు గుడ్లు, పప్పులు, నూనె అందరికీ అందుతున్నాయి . ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ తూం అనిత పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అంగన్ వాడీ కేంద్రాల్లో పుట్టిన పిల్లల నుంచి మూడు సంవత్సరాల పిల్లల వరకు గుడ్లు, పాలు, బాలమృతం అందిస్తున్నామని. అటు బాలింత తల్లులకు ఆరోగ్యకరమైన భోజనంతో పాటు వారికి పలు సూచనలు చేస్తున్నామని తెలిపారు