
మద్యం మత్తులో ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం….
ఒకరు బలి,మరో ముగ్గురికి తీవ్ర గాయాలు…
నేటిధాత్రి కమలాపూర్ (హనుమకొండ)కమలాపూర్ మండలంలోని గోపాల్పూర్ గ్రామ శివారులో సోమవారం జరిగిన ఆటో ప్రమాదంలో నడికుడ మండలం చర్లపల్లికి చెందిన శనిగరపు వంశీ మృతి చెందినట్లు కమలాపూర్ సిఐ హరికృష్ణ తెలిపారు. హోలీ పండుగ పురస్కరించుకుని చర్లపల్లి గ్రామానికి చెందిన నలుగురు యువకులు మద్యం సేవించి హోలీ సంబరాలు జరుపుకొని కమలాపూర్ మండలంలోని శనిగరం గ్రామం నుండి ఆటోలో చర్లపల్లి కి వెళుతుండగా గోపాల్పూర్ శివారులో డ్రైవర్ అజాగ్రత్తతో ఆటో బోల్తా పడటంతో ఆటో లో ప్రయాణిస్తున్న శనిగరపు వంశీ మృతి చెందినట్లు తెలిపారు. మృతిడితో పాటు ఆటోలో డ్రైవర్ గంగారం వినయ్, బొల్లం ప్రశాంత్, శనిగరం సాయి నలుగురు ప్రయాణిస్తున్నట్లు తెలిపారు.వంశీ ప్రమాద స్థలంలోనే మృతిచెందగా మిగతా ముగ్గురిని వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ కు చికిత్సా నిమిత్తం పంపించినట్లు, మృతుడి శవాన్ని శవపరీక్ష నిమిత్వం ఎంజిఎంకు పంపించినట్లు తెలిపారు.