
చిట్యాల, నేటిధాత్రి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ యువజన సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో హోళీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్బంగా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య మాట్లాడుతూ దేశ రాష్ట్రవ్యాప్తంగా కుల మతాలకతీతంగా వివిధ రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ కలిసి జరుపుకుంటున్నారు చిన్న పెద్ద తేడానే లేకుండా అధికారులు అనధికారులు ప్రజలు ప్రతి ఒక్కరు హోళీ సంబరాలను ఘనంగా జరుపుకున్నారని అన్నారు,ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రచార కార్యాదర్శి గుర్రపు రాజేందర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మదు వంశి క్రిష్ణ జిల్లా నాయకులు చిలుకల రాయకొంరు ఏవైయస్ మండల కమిటీ నాయకులు గుర్రపు రాజమౌళి కనకం తిరుపతి మైదం మహేశ్ పుల్యాల సురేష్ కట్కూరి రమేష్ కట్కూరి రాజేందర్ పాముకుంట్ల చందర్ ఏకు కిషన్ ముత్యాల మొగిలి వివిధ సంఘాల, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.