
శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలోని రేషన్ డీలర్ల పై చర్యలు తీసుకోవాలని ఎమ్మార్వోకు వినతి పత్రం అందజేసినట్లుగా ఏబిఎస్ఎఫ్ డివైఎఫ్ఐ నాయకులు తెలియజేసారు. అనంతరం ఎబిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు నాగుల పవన్ కళ్యాణ్ డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి మంద సురేష్ మాట్లాడుతూ దారిద్యరేఖ దిగువన ఉన్న నిరుపేదలకు కనీసం రెండు పూటలా ఆహారం అందించి అభివృద్ధిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా పంపిణీ అందుబాటులోకి తీసుకువచ్చి రేషన్ షాప్ ఆధారంగా అందిస్తున్నారు కానీ రేషన్ షాపుల్లో తూనికల్లో అవకతవకలు జరుగుతున్నా యని ఆరోపించారు. దాదాపుగా ఒక్కక్కరి రేషన్ పైన మూడు కిలోల వరకు మోసం చేస్తూ పేద ప్రజల పొట్టకొడుతూ సొమ్ము చేసుకుంటున్నా రేషన్ డీలర్ల పైనచర్యలుతీసుకోవాలి.ప్రజలకు న్యాయం చేయాలనీ డిమాండ్ చేశారు.ఎమ్మార్వో స్పందించి తూనికలు తనిఖీ చేపిస్తామని హామీ ఇచ్చారని తెలియ జేసారు. ఈ కార్యక్రమం జిల్లా నాయకులు రాజశేఖర్, మనోజ్ పాల్గొన్నారు.