తై బజారు వేలం

నిజాంపేట: నేటి దాత్రి, మార్చి 23

మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో శనివారం రోజు న సీనియర్ అసిస్టెంట్ రమేష్ ,కార్యదర్శి నర్సింలు ఆధ్వర్యంలో తై బజార్ వేలం పాట వేయడం జరిగింది ఈ వేలం పాటలో ఆనరాశి పోశయ్య 1 లక్ష 66 వేలకు దక్కించుకోవడం జరిగింది ఈ సందర్భంగా కార్యదర్శి నర్సింలు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు తై బజార్ వేలం వేయడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం 1 లక్ష 66 వేలకు వేలం పాట జరిగింది గత సంవత్సరంలో 3 లక్షలకు పోవడం జరిగింది పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం తక్కువగా పోవడం జరిగింది కాబట్టి ఈ నివేదికను పై అధికారులకు పంపి తై బజార్ వేలం ఫైనల్ చేస్తామని వారు అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!