పరకాల నేటిధాత్రి
శనివారం రోజున హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు సందర్శించడం జరిగింది. అనంతరం ఆర్ యం ఒ డాక్టర్ బాలకృష్ణ డాక్టర్ల పరిచయ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.హాస్పిటల్ లోని అన్ని విభాగాలను డాక్టర్ బాలకృష్ణతో కలిసి సందర్శించారు.మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు రోగులను వైద్యులు నర్సులు వైద్య సేవలు,సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బాలకృష్ణ సేవలును అభినందించారు.
పరకాల పరిసర ప్రాంతాలలో పేద ప్రజలు ఎక్కువగా ఉంటారని వసతులు అందుబాటులో ఉన్నాయని కాబట్టి డాక్టర్లు కానీ ఇతర సిబ్బంది కానీ రోగులకు సరియైన సేవలు అందించాలని సూచించారు.
నర్సరీల ఆకస్మిక తనిఖీ
వేసవికాలం దృశ్యా ఎప్పటికప్పుడు మొక్కలకు నీటిని అందించాలి
మండలంలోని పైడిపల్లి లక్ష్మీపురం గ్రామ పంచాయతీ నర్సరీలను ఏపిఓ ఇందిర కలిసి ఆకస్మిక తనఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు మొలకెత్తక ఖాళీ గా ఉన్న బ్యాగులలో నారు తెచ్చి నాటాలని సూచించారు.అలాగే ప్రతి రోజూ ఉదయం సాయంత్రం రెండు మార్లు నీల్లు పట్టించాలని వాచర్ ఎప్పటి కప్పుడు కలుపు మొక్కలు తొలగించాలని వేసవికాలాన్ని దృష్టిలో పెట్టుకొని మొక్కలకు ఎప్పటికప్పుడు వాటర్ అందించాలని వాచర్ మరియు ఫీల్డ్ అసిస్టెంట్ లను ఆదేశించారు.