
ఇప్పటికే 20సార్లు రక్తదానం చేసిన ప్రవీణ్
నేటిధాత్రి, వరంగల్
వరంగల్ పెద్దమ్మగడ్డ ప్రాంతానికి చెందిన ప్రవీణ్ ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేస్తూ ప్రాణదాతగా నిలుస్తున్నాడు. పెద్దమ్మగడ్డ అంటే ఒకప్పుడు రౌడీయిజానికి పేరుపొందింది, కానీ మానవత్వం ఉన్న గుండెలు ఉంటాయని నిరూపిస్తున్నాడు ప్రవీణ్ అనే యువకుడు. ఒక పక్క కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే, మరోపక్క సామాజిక సేవలో ముందంజలో ఉంటూ, పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. అత్యవసర పరిస్థితుల్లో పలువురికి ప్రాణదాతగా నిలుస్తున్నాడు. తానొక్కడే కాక సోషల్ మీడియా ద్వారా కూడా మరింత మందిని ప్రాణదాతలుగా నిలుపుతున్న ప్రవీణ్ ను పలువురు అభినందించారు.