
వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నరహరి నరేష్ కు ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ గా నియా కం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి కి వనపర్తి ఎమ్మెల్యే తుడిమేగారెడ్డికి నమ్మిన వ్యక్తి నరహరి నరేష్ ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పదవి వచ్చే అవకాశం ఉన్నదని పలువురు అంటున్నారు . ఈ మేరకు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కల్వ సుజాత నరహరి నరేష్ కు కార్పొరేషన్ డైరెక్టర్ పదవి ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది . 1998 నుండి నరేష్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కార్యకర్తగా పనిచేస్తూ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డికి ఎమ్మెల్యే మెగారెడ్డి కి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తూ ఉన్నారు . మంత్రి జూపల్లి కృష్ణారావు నరహరి నరేష్ కు డైరెక్టర్ పదవి ఇవ్వడానికి పూర్తి అండదండలు ఉన్నట్లు సమాచారం . ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత నరహరి నరేష్ గురించి విచారణ చేసినట్లు తెలిసింది .