ఆకాంక్ష
హైద్రాబాద్ | నల్లకుంట.
హొలీ పండుగను పురస్కరించుకుని నేడు శ్రీ ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు పాలపర్తి సంధ్యారాణి న్యూ నల్లకుంట లోని ప్రభుత్వ పాఠశాలలో 80 మంది విద్యార్థిని విద్యార్థులకు స్వీట్స్ పళ్ళు పంచి పెట్టారు.తమ సంస్థ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వారికి ఏదో ఒక చేయూత ఇవ్వడం జరుగుతోందని,నోట్ బుక్స్,సానిటరీ నాప్కిన్స్,వస్త్రాలు అందచేయడమే కాక యాజమాన్యం కోరిక మేరకు తమ పరిధిలో చేయగలిగింది తప్పక చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల HM సుబ్బలక్ష్మి మరియు ఉపాధ్యాయులు,రమణ,చంద్ర శేఖర్,అరుణ పాల్గొన్నారు.