
కూకట్పల్లి, మార్చి 22(నేటి ధాత్రి ఇన్చార్జి
మల్కాజ్గిరి పార్ల మెంటు నియోజక వర్గం నుంచి గెలిచిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అ య్యారని అలాంటి మల్కాజ్గిరి పార్ల మెంటు సీటును మరోసారి గెలిపించి ముఖ్యమంత్రికి కానుకగా ఇవ్వాలని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కార్యక ర్తలకు పిలు పుని చ్చారు. మల్కా జ్గిరి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమా వేశం శుక్ర వారం బోయిన్పల్లిలోని జయలక్ష్మి గార్డెన్స్ లో జరిగింది.ఈ సమావేశం లో పాల్గొన్న బండి రమేష్ మాట్లాడు తూ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా జరగాలంటే అభివృద్ధి కుం టుపడకుండా ఉండాలంటే ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మరింత బలపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నెల రోజులో నే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 159 ఎకరాల కంటోన్మెంట్ భూమిని రా ష్ట్ర అవసరా లకు వినియోగించు కునేలా ఒప్పించడం గొప్ప విషయం అన్నా రు.ఎన్నికల ప్రణాళికలో భా గంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలను మూడు నెలల్లోనే అమ లు చేయడం గొప్ప విషయం అన్నా రు.హైదరాబాద్ నగరం నాలుగు వై పులా విస్తరించాల్సి ఉందని అందు కోసం మల్కాజ్గిరి వైపు ఐటీ కంపెనీ లతోపాటు మల్టిలెవెల్ ఫ్లై ఓవర్లు మె ట్రో రైలు రావలసిన అవసరం ఉంద న్నారు.38 లక్షల ఓటర్లు ఉన్నమ ల్కాజిగిరి పార్లమెంటు సీటు గెలవా లంటే కార్యకర్తలు అందరూ కలిసిక ట్టుగా కష్టపడి పనిచేయాలన్నారు.కేంద్ర ప్రభుత్వం నుంచి అధికనిధులు కావా లంటే ఖచ్చితంగా రా ష్ట్రం నుంచి ముందుగా గెలవాల్సిన సీటు మల్కాజ్గిరి అన్నారు.అలాగే పార్టీలో పనిచేసే కార్యకర్తలు అందరి ని గుర్తించి పార్టీ పరంగా ప్రభుత్వప రంగా తగిన గుర్తింపు నివ్వాలని రా ష్ట్ర నాయక త్వానికి బండిరమేష్ సూచించారు.