మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు
నిజాంపేట. నేటి ధాత్రి, మార్చి 20
వడగండ్ల వానతో నష్టపోయిన రైతు కుటుంబాలను కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనపల్లి రోహిత్ అన్నారు. మండల పరిధిలోని నందిగామ, జడ్ చెరువు తండా, బచ్చు రాజు పల్లి గ్రామాలలోని వరి మొక్కజొన్న పంటలను సందర్శించి రైతులకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షం వల్ల పంటలకు నష్టం వాటిల్లడం చాలా బాధాకరమని, ముఖ్యంగా నిజాంపేట మండలంలో ఎక్కువగా నష్టం వాటిల్లిందని తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రైతులకు నష్టపరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటామని రైతులకు భరోసా ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని, రైతు కన్నీళ్లు తోడవడానికి కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని రైతులకు ధీమా చెప్పారు. అదేవిధంగా గత ఐదు రోజుల క్రితం విద్యుత్ షాక్ తో మృతి చెందిన భక్కోళ్ల మల్లేశం కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమాలు త్వరగా వచ్చేలా కృషి చేస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి సుప్రభాత రావు, సీనియర్ నాయకులు చెప్పెట ముత్యంరెడ్డి, సత్యనారాయణ రెడ్డి, మండల అధ్యక్షుడు మారుతి, పట్టణ అధ్యక్షులు నసీరోద్దీన్, ఆకుల బాలయ్య, నరేందర్, వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.