-ఎం ఈ ఓ, వార్డ్ కౌన్సిలర్
-సమావేశంలో మాట్లాడుతున్న ఎంఈఓ బాణాజీ
-వాణి విద్యాలయ విద్యార్థుల విజ్ఞాన ప్రదర్శన
-ఆకట్టుకున్న సైన్స్ ఫెయిర్
-ఆలోచింపజేసిన విద్యార్థుల ప్రతిభ
-మండల విద్యాధికారి బాణాజీ
వేములవాడ,నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ విద్యార్థులు రూపొందించిన పలు ఆవిష్కరణలు ఆలోచనలు రేకెత్తించేలా ఉన్నాయి. విద్యార్థుల ప్రదర్శించిన విజ్ఞానిక ప్రదర్శన బళ అనిపిచారని వాణి విద్యాలయం విద్యార్థులను మండల విద్యాధికారి అభినందించారు. బుధవారం వేములవాడ లోని వాణి విద్యాలయం హైస్కూల్లో విద్యార్థిని, విద్యార్థులు అట్టహాసంగా ప్రారంభించిన. సైన్స్ ఫెయిర్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాధికారి బాణాజీ, వార్డ్ కౌన్సిలర్ యాచమనేని శ్రీనివాస్ తిలకించి అభినందించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి వెలికితీయాలని అన్నారు. తెలియని విషయాలను తెలుసుకోవడమే సైన్స్ అని అన్నారు. ప్రకృతి, పర్యావరణంపై విద్యార్థులకు ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని కోరారు. అనంతరం సైన్స్ ఫెయిర్ లో గెలుపొందిన విద్యార్థులకు ఆయన బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వాణి విద్యాలయం హై స్కూల్ కరస్పాండెంట్ లు బద్దం అనంతరెడ్డి, పిల్లి మహేష్, ప్రధాన ఉపాధ్యాయులు బత్తిని రాము, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు మమత, రేష్మి, విద్యార్థిని, విద్యార్థులు తో పాటు తదితరులు పాల్గొన్నారు.