# మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ డిమాండ్.
నర్సంపేట,నేటిధాత్రి :
చెన్నరావుపేట మండలం భోజర్వు గ్రామంలో తాటి చెట్టు పై నుంచి పడి చనిపోయిన దీకొండ నాగేశ్వర్ రావు గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు. బొజెర్వు గ్రామంలో బుధవారం ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుంచి పడి చనిపోయిన నాగేశ్వర్ రావు పార్థీవదేహంపై రమేష్ గౌడ్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం నాగేశ్వర్ రావు గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మోకుదెబ్బ జిల్లా అధ్యక్షులు గోపగాని వెంకట్ గౌడ్, రాష్ట్ర నాయకులు మద్దెల సాంబయ్య గౌడ్,దొమ్మటి పురుషోత్తం గౌడ్, కత్తి స్వామి గౌడ్, బండి రమేష్ గౌడ్, బోడిగే నరేందర్ గౌడ్, బుర్ర సుదర్శన్ గౌడ్, బోడిగే వెంకట్ గౌడ్, మేడి ప్రభాకర్ గౌడ్, సుధాకర్ గౌడ్, గండు రాజు గౌడ్, రామగోని రవి గౌడ్, మడూరి బుచ్చిరాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.