ఉచిత కరెంటు పథకం ప్రజల్లో విద్యుత్ వినియోగం లో నియంత్రణ దారి తీసింది.
200 యూనిట్ల విద్యుత్ ఉచితం అనే పథకం సామాన్య కుటుంబానికి ఎనలేని ఆసరా,మండలంలో 50 శాతం వినియోగదారులకు జీరో బిల్.
సబ్సిడీ గ్యాస్, గృహ లక్ష్మి, రేషన్ కార్డ్, ఉచిత ప్రయాణం తో ప్రజలు సంతృప్తి, మిగతా పథకాల జాప్యంతో కాస్త నిరాశ.
పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలుతో 6 గ్యారంటీ పథకాలకు బ్రేక్, దరఖాస్తుదారులకు ఇబ్బందులు. ఇక కొత్తవారికి పథకాలు మూడు నెలల వరకు లేనట్టే.
మహాదేవపూర్ -నేటి ధాత్రి:
తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 3న కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలకు అమలు చేసే కార్యక్రమాన్ని డిసెంబర్ 9 నుండి ప్రారంభించడం జరిగింది. మొట్టమొదట రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి ఇనుముల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకంలో ప్రాణాలకు సంబంధించి మహిళల ప్రయాణం విషయంపై ప్రతిపక్షాలు ఇతర వాహనదారులకు సంబంధించి ఇబ్బందులు ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినప్పటికీ ప్రభుత్వం వెనుకడుగు వేయకుండా నూతన ఆర్టీసీ బస్సులను అదనంగా ఏర్పాటు చేస్తూ మహిళలకు ఉచిత ప్రయాణం తో పాటు ఇతరులకు ఇబ్బందులు కలగకుండా పలు జాగ్రత్త చర్యలను చేపడుతూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పథకాన్ని కొనసాగించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ 6 గ్యారంటీ పథకాలలో మహాలక్ష్మి పథకం లోని సబ్సిడీ సిలిండర్ తో పాటు మహిళలకు ఉచిత ప్రయాణం, గృహ జ్యోతి పథకంలోని రెండు వంద యూనిట్లకు సంబంధించి ఉచిత కరెంట్ పథకం అమల్లోకి తీసుకురావడం జరిగింది. అలాగే రైతు భరోసా కు సంబంధించి పాత పద్ధతిని ప్రస్తుతం దశలవారీగా రైతులకు రైతు భరోసా పేరుతో పెట్టుబడి సాయం అందించడం జరిగింది. మిగతా 6 గ్యారంటీలకు సంబంధించి మహాలక్ష్మి పథకంలోని మహిళలకు 2500 ఆర్థిక సహాయం, ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం ఐదు లక్షల రూపాయలు మరియు ఇంటి స్థలం, రైతు భరోసా లోని వ్యవసాయ కూలీల 12 వేల రూపాయలు వరి పంట బోనస్ అలాగే యువ వికాసం పథకంలోని ఐదు లక్షల రూపాయల విద్య భరోసా కార్డు తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్లో ఏర్పాటు పథకాలు ఇంకా అమలు దోచుకోలేదు. ఇప్పటికీ అమలవుతున్న పథకాలకు సంబంధించి రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై సంతోషాన్ని వ్యక్తం చేయక తప్పడం లేదు.
జీరో కరెంట్ బిల్లు, కళ్ళల్లో ఆనందం, శభాష్ మంత్రి.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన అనంతరం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో పడిన ప్రభుత్వం ఒకదాని తర్వాత మరొక పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చేలా కార్యక్రమాలను ముమ్మరంగా సాగిస్తూ రాష్ట్ర ప్రజల మనసులను దోచుకుంటుందని అనక తప్పడం లేదు. ప్రభుత్వం కొలువుదీరిన వారం రోజులకే మహాలక్ష్మి పథకం లోని ఉచిత ప్రయాణం పథకాన్ని ప్రారంభించింది. ఆ పథకానికి రాష్ట్రంలోని 90% మహిళలు ఉపయోగించుకోవడం ప్రజలు ప్రభుత్వం అందించిన ఉచిత ప్రయాణ పథకాన్ని ఎంతో సంతోషంగా ఆహ్వానించి మహిళలు ఆ పథకాన్ని వినియోగించుకోవడంలో నిమగ్నం కావడం కూడా జరిగింది. గృహ జ్యోతి పథకానికి సంబంధించి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడంలో ప్రభుత్వం విజయాన్ని సాధించిందని చెప్పవచ్చు. ఉమ్మడి మండలంలో సుమారు 7 వేల గృహ వినియోగదారులు గృహ జ్యోతి పథకంలో దరఖాస్తు చేసుకోగా మార్చ్ నెలలో సుమారు నాలుగు వేల పైచిలుకు కుటుంబాలకు జీరో కరెంట్ బిల్ రావడం ఫిదా మధ్య తరగతి కుటుంబాల్లో ఆనందానికి హద్దు లేకుండా పోయింది. సుమారు 50 యూనిట్ల నుండి 200 యూనిట్ల వరకు గతంలో బిల్లు చెల్లించాలంటే 600 నుండి 1200 రూపాయల వరకు డబ్బులు చెల్లించాల్సి ఉండేది అనేక కుటుంబాలకు విద్యుత్ కరెంటు బిల్లు ఒక ప్రధాన సమస్యగా ఉన్న తర్వాత తరుణంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉచిత కరెంటు అందించడం పేద ప్రజలకు ఒక వరంగా అని కూడా చెప్పవచ్చు, తాజాగా ఈనెల విద్యుత్ కరెంట్ బిల్లు 0 బిల్ అని రావడంతో పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల తో పాటు మైనార్టీ వర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తమ మనసులను గెలుచుకున్నారని అంటున్నారు ప్రజలు. ఇక కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల విషయానికొస్తే మేనిఫెస్టో రూపకర్త మంథని నియోజకవర్గం ఎం ఎల్ ఏ ప్రస్తుత మంత్రి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ రాష్ట్ర ప్రజలకు ప్రధాన సమస్య విద్యుత్ వినియోగం అనే విషయానికి ప్రధాన అంశంగా తీసుకొని నేడు ఉచిత కరెంట్ ప్రభుత్వం అందించడం జరుగుతుంది అంటే అది మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కు రాష్ట్ర ప్రజలు అలాగే మంథని నియోజకవర్గ ప్రజల సమస్యలపై ఉన్న పట్టుదలే నేడు తమకు ఉచిత విద్యుత్ అందుతుందని ఉమ్మడి మండల ప్రజలు మంత్రి శ్రీధర్ బాబుకు శభాష్ అని అంటున్నారు.
ఉచిత కరెంటు పథకం ప్రజల్లో విద్యుత్ వినియోగం లో నియంత్రణ దారి తీసింది.
రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు విద్యుత్ వినియోగిస్తున్న క్రమంలో ఇంత నియంత్రణను పాటించినప్పటికీ కూడా విద్యుత్ బిల్లు కట్టే సమయానికి అనేక కుటుంబాల్లో ఎనలేని ఇబ్బందులు ఉండేవి, నియంత్రణ పాటించినప్పటికీ కూడా ప్రతినెల 75 నుండి 160 యూనిట్లు సామాన్య మధ్యతరగతి కుటుంబానికి విద్యుత్ ఉపయోగించుకునే పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో 160 యూనిట్ల బిల్లు సుమారు 800 నుండి 1200 రూపాయల వరకు విద్యుత్ శాఖకు చెల్లించాల్సిన పరిస్థితి ఉండేది. ఆ సందర్భంలో సామాన్య మధ్యతరగతి కుటుంబాలు విద్యుత్ వినియోగ విషయంలో యూనిట్ల మార్పిడి వలన ఎంత వినియోగించుకున్న నియంత్రణ పాటించి వినియోగం చేపట్టినప్పటికీ కూడా విద్యుత్ శాఖకు కట్టే బిల్లులో మాత్రం కేవలం 100 నుండి 150 రూపాయల మార్పు మాత్రమే కనిపించే పరిస్థితి. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించడం ఒక వరంగా భావిస్తున్నారు ఉమ్మడి మండల ప్రజలు. గతంలో విద్యుత్ వినియోగంలో ఎంత నియంత్రణ పాటించి నప్పటికీ కూడా ఫలితం లేకపోవడం ఈరోజు విద్యుత్ వినియోగంలో నియంత్రణ పాటించడం వలన పూర్తిగా ఉచిత విద్యుత్ వినియోగం చేసుకోవడానికి దారి తీయడంతో ప్రజలు విద్యుత్ వాడకంలో స్వతగా కొంత మార్పులను చేసుకోవడం జరిగింది వాటిలో ఎల్ఈడి లిజర్ లాంప్ లాంటి బల్బులను వినియోగంలోకి తీసుకువస్తూ ప్రతి కుటుంబం 200 యూనిట్లు లోపు విద్యుత్ వినియోగించుకునే ప్రయత్నంలో ఉన్నారు.
200 యూనిట్ల విద్యుత్ ఉచితం అనే పథకం సామాన్య కుటుంబానికి ఎనలేని ఆసరా,మండలంలో 50 శాతం వినియోగదారులకు జీరో బిల్.
గృహ జ్యోతి పథకం నుండి ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ వినియోగం 200 యూనిట్ల లోపు విద్యుత్ ఉపయోగించిన ప్రతి కుటుంబానికి ఉచితంగా జీరో బిల్ అందించే ఈ పథకం సామాన్య కుటుంబానికి చెప్పుకోలేనంత ఆసరాగా నిలిచింది. కరెంటు బిల్లు అంటేనే భయంతో ఉలిక్కిపోయే ఆ పేద కుటుంబాలకు ఉచిత బిల్లు ఈరోజు ఒక వరం మారిందని ప్రత్యక్షంగా అనేక కుటుంబాలు తమ గ్రామాల్లో చుట్టుపక్కల వారితో కలిసి ఉచిత విద్యుత్ జీరో బిల్ రావడం పై ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షిస్తూ చర్చించుకుంటున్నారు. ఇక మహాదేవపూర్ మండల జీరో బిల్ విషయానికొస్తే గతంలో మహదేవ్పూర్ మండలం నుండి 7000 గృహ వినియోగదారులకు సంబంధించి సుమారు మార్చ్ ఏప్రిల్ మీ నెలలో విద్యుత్ శాఖకు 45 నుండి 55 లక్షల భూపాల బిల్లులను వినియోగదారులు కట్టడం జరుగుతుంది. బరువుల మండలం వ్యవసాయ కుటుంబాలకు సంబంధించిన అనేక గ్రామాల ప్రజలు కేవలం ఒక నెల 55 లక్షల రూపాయల వరకు కరెంటు బిల్లు రూపంలో విద్యుత్ శాఖకు అందించడం అలాంటి విషయాన్ని ఆలోచిస్తే ఆ కుటుంబాల పరిస్థితి ఇంత పెద్ద మొత్తంలో డబ్బులను ఎలా అందించడం సాధ్యమైందో ఊహించలేని పరిస్థితి. కానీ ఈరోజు సుమారు 4000 కుటుంబాల కు ఇప్పటికే మార్చ్ నెల బిల్లు లేకుండా జీరో బిల్ అందించడం జరగడంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం మరియు మంత్రి శ్రీధర్ బాబుకు మండల ప్రజలు జై కొట్టడం జరుగుతుంది అనడంలో సందేహం లేదు.
సబ్సిడీ గ్యాస్, గృహ లక్ష్మి, రేషన్ కార్డ్, ఉచిత ప్రయాణం తో ప్రజలు సంతృప్తి, మిగతా పథకాల జాప్యంతో కాస్త నిరాశ.
రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఇప్పటికే గృహజ్యోతి పథకంలోని ఉచిత కరెంటు అలాగే మహాలక్ష్మి పథకం నుండి ఉచిత ఆర్టీసీ ప్రయాణం పథకాలను అమలు చేస్తున్న క్రమంలో, మిగతా 6 గ్యారంటీలోని గ్యాస్ సబ్సిడీ రేషన్ కార్డ్ మహిళలకు 2500 రూపాయల పెన్షన్ తోపాటు 6 గ్యారంటీలో పొందుపరిచిన విద్యార్థులకు 5 లక్షల గ్యారంటీ కార్డు ఇంటర్నేషనల్ పాఠశాలలు రైతు కూలీలకు 500 లాంటి పథకాలకు ప్రభుత్వం అమలుపరచడంలో ఆర్థిక వ్యవస్థ లేదా ఇతర కారణాల వల్ల జాప్యం చేయడం వలన ప్రజల్లో కాస్త నిరాశ ఇంకా మిగిలి ఉంది, ప్రధానంగా ప్రస్తుతం అమలవుతున్న 200 ఉచిత యూనిట్లకు సంబంధించి మహదేవ్పూర్ ఉమ్మడి మండలంలో మరో 50% లబ్ధిదారులు పలు సాంకేతిక కారణాల వల్ల వారు ఉచిత విద్యుత్ పథకంలో అనర్హులుగా కావడం వారికి మార్చి నెల జీరో వీలుకు బదులు వారు వినియోగించుకున్న యూనిట్ల ప్రకారం వారికి బిల్లు రావడం, అలాగే ఇతర గ్యాస్ సబ్సిడీ లాంటి పథకాలకు ప్రత్యేకంగా అనేక కుటుంబాలకు సంవత్సరాల తరబడి రేషన్ కార్డు లేకపోవడంతో సబ్సిడీ పథకం తో పాటు ఇతర పథకాలకు దరఖాస్తు చేసుకునే క్రమంలో కూడా వారు అనరుగా ఉండడం కొత్త రేషన్ కార్డు మంజూరుకు విషయంలో ప్రభుత్వం కాస్త జాప్యం చేయడంతో ప్రజల్లో ఇంకా ప్రభుత్వంపై అసంతృప్తి వ్యవహరించక తప్పడం లేదు మండల ప్రజలు. పథకాలు పొందిన ప్రజలు సంతృప్తి చెందినప్పటికీ కూడా ప్రధాన అంశాలకు రేషన్ కార్డ్ మంజూరు విషయంలో గత పది సంవత్సరాల నుండి అనేక కుటుంబాలు రేషన్ కార్డు లేక అనేక ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితులు ఒకవైపు అయితే మరోవైపు పెన్షన్ల వ్యవహారానికి సంబంధించి వితంతువులు వృద్ధులు వికలాంగులు కొత్త పెన్షన్ వ్యవస్థ ప్రభుత్వం త్వరలో అమలులోకి తీసుకువస్తే బాగుండేదని ఆవేదన చెందక తప్పడం లేదు.
పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలుతో 6 గ్యారంటీ పథకాలకు బ్రేక్, దరఖాస్తుదారులకు ఇబ్బందులు. ఇక కొత్తవారికి పథకాలు రెండు నెలల వరకు లేనట్టే.
తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి మూడు నెలల కాలం పూర్తవుతున్న క్రమంలో ప్రభుత్వం హామీ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి లబ్ధిదారునికి పథకాలు అందించే క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రజా పాలన దరఖాస్తు సెంటర్లను ఏర్పాటు చేసి పథకాలకు అర్హులైనప్పటికీ కూడా సాంకేతిక కారణాలు ఇతర పత్రాలు నిబంధనలకు సంబంధించి అందించని వారికి పథకం అందకపోవడం లాంటి సమస్యలను పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ప్రజా పాలన దరఖాస్తు కేంద్రాలు గత కొన్ని రోజులుగా ప్రజలతో కిక్కిరిసిలాడి దరఖాస్తులను అందించడం జరిగింది. అయినప్పటికీ అనేకమంది ఉచిత విద్యుత్ గ్యాస్ సబ్సిడీ తోపాటు ఇతర ప్రభుత్వం ప్రారంభించిన పథకాలకు సంబంధించి నమోదు పత్రాలను అందించే క్రమంలోనే పార్లమెంట్ ఎన్నికల నగర మోగడంతో ప్రజా పాలన కేంద్రాలను మూసి వేయడం జరిగింది. మరో రెండేళ్ల వరకు లబ్ధిదారులకు పథకాల దరఖాస్తు సమర్పణ లాంటి వాటిని మూసి వేయడం జరిగింది. అధికారుల నిర్లక్ష్యమో పేద ప్రజలకు అవగాహన లేక సుమారు మూడు నెలల నుండి గ్రామపంచాయతీలో అందించిన ప్రజా పాలన దరఖాస్తు ఫారాల్లో పర్యవేక్షణ కరువై కాగితాల సమర్పణ వివరాలను ప్రజలకు చేరువయ్యేలా అధికారులు అందించకపోవడం అని స్పష్టం కాక తప్పడం లేదు ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలలు పూర్తి అవుతున్న క్రమంలో కూడా గ్రామ గ్రామాన వేలల్లో ప్రజలు దరఖాస్తులను అందించడం జరిగింది కానీ ప్రజలు అందించిన దరఖాస్తు పరిశీలన అధికార యంత్రాంగం అప్పటికప్పుడే దరఖాస్తుదారునికి వివరాలు చెప్పి సముచిత పత్రాలను తీసుకొని ఉంటే సుమారు ఉమ్మడి మండలంలో 85% ప్రజలు పథకాలను లబ్ధి పొందే వారిని కానీ నేటికీ ప్రజల వద్ద నుండి దరఖాస్తులను స్వీకరించడం ఒకవైపు అధికార యంత్రాంగం నిర్లక్ష్యం మే అనడానికి సందేహం లేదు. అనేకమంది ప్రజలు తమ దరఖాస్తు ఫారాలను పట్టుకొని ప్రజా పాలన దరఖాస్తు సెంటర్ కు వస్తున్న క్రమంలో పార్లమెంట్ ఎన్నికల నగరము కొత్త పథకాల దరఖాస్తుల స్వీకరణ సమాప్ చేయడం అర్హులుగా ఉన్నప్పటికీ కూడా పథకాలను లబ్ధి పొందకుండా ఉన్న ఆ పేద ప్రజలకు మరో రెండు నెలలు వేచి ఉండక తప్పదు.