రామవరం కమ్యూనిటీ హాల్ నందు ఓపెన్ స్టేజ్ మరియు షెడ్డు,మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి.

సింగరేణి వైస్ ప్రెసిడెంట్ రజాక్!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి

కొత్తగూడెం ఏరియాలోని జి.ఎం ఆఫీస్ నందు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజును ఐఎన్టియుసి కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎం.డి రజాక్, వారి ఆఫీస్ నందు కలిసి రజాక్ జి.ఎం తో మాట్లాడుతూ రామవరం లోని  కమ్యూనిటీ హాల్ నందు ఓపెన్ స్టేజ్ మరియు షెడ్డు, టైల్స్, డైనింగ్ హాల్ నుఎత్తు లేపడం, టైల్స్,డైనింగ్ హాల్ చుట్టూ మెష్, కుకింగ్ హాల్ చుట్టూ మెష్ ఏర్పాటు చేయాలి, డైనింగ్ హాల్ మరియు కుకింగ్ హాల్ నందు కోతులతో ఇబ్బందికరంగ ఉండడంతో మెష్ మరియు డోర్లు తప్పనిసరి బిగించాలి, హాల్ లోపలి భాగంలో ఫాల్ సీలింగ్, మరియు పాత్ టైల్స్, మెయిన్ గేట్ ముందు ఆవులు రాకుండా రైలింగ్, రౌండ్ గేట్ త్వరలో ఏర్పాటు చేయాలని కోరడమైనది, రాబోయే రోజులలో ఎక్కువ శుభకార్యాలు ఉండడం వల్ల ఉద్యోగుల కుటుంబ సభ్యుల శుభకార్యాలకు, పెళ్లి మరియు రిసెప్షన్లకు ఇబ్బంది కలగకుండా త్వరగా పూర్తి చేయించాలని ఈ సందర్భంగా తెలియజేయడమైనది, జి.యం స్పందిస్తూ ఎ.జి.ఎం, (సివిల్) రామకృష్ణ కు ఆదేశాలు ఇవ్వడం జరిగింది,వారు త్వరలోనే ఏర్పాటు చేస్తామని తెలియజేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!