కాంగ్రెస్ పార్టీలోకి పలు డివిజన్ల నుండి సుమారు 100 మంది బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తాళ్లపల్లి చిన్నా. ఆధ్వర్యంలోపెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. విశాల్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి కి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలను బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయకపోవడం, బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి మొన్నటి ఎన్నికల వరకు ప్రజలను మోస పూరిత మాటలతో మభ్యపెడుతూ కాలం వెల్లదీశారని అన్నారు.పార్టీలో చేరిన కార్యకర్తలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ నాయకులు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే ప్రజాపాలన సాధ్యమని తెలిసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు.
బిఆర్ఎస్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి వేలుపుల జాన్ వెస్లీ, తాళ్లపల్లి చిన్న,గిరబోయిన శ్యామ్, పులిశేరు అరుణ్ కుమార్, మున్నా,పసునూరి మనోహర్, తదితరులు చేరారు.