ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
మంగళవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముదిరాజుల ఆత్మీయ సమ్మేళన సభ రాజమౌళి అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్యఅతిథిగా హాజరై అనంతరం మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న చెరువులపై పూర్తి హక్కు ముదిరాజులదే ఎవరైనా కాంట్రాక్టర్స్ చెరువులలో చేప పిల్లలు పోస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం ముదిరాజులు రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులు గత కొన్ని సంవత్సరాలుగా నాతో కలిసి పని చేశారని ముదిరాజుల అభివృద్ధికి సరియైన ప్రణాళిక ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి అమలు చేస్తామని వారి ఆర్థిక అభివృద్ధికి మత్స్య శాఖ పరంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తాం రాబోయే రోజుల్లో ముదిరాజుల లో ఉన్నటువంటి పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం నియోజకవర్గ ప్రజల అభ్యున్నతికి కోసం సి ఎస్ ఆర్ డి ఎఫ్ టి నిధుల ద్వారా ఇక్కడి ప్రజల కొరకై నిధులను వినియోగిస్తాం మత్స్యశాఖలో ఉన్న పథకాల ద్వారా ఆటోలు నాణ్యమైన చేప పిల్లలు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ముదిరాజుల జిల్లా అధ్యక్షుడు జోరుగా సాదయ్య ముదిరాజ్ జిల్లా కమిటీ సభ్యులు తోట గట్టయ్య జిల్లా ఉపాధ్యక్షులు చిలుకల పాణి మత్స శాఖ చీఫ్ ప్రమోటర్ రాష్ట్ర కమిటీ సభ్యులు రమేష్ జడ్పిటిసి పులి తిరపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీ అర్బన్ వర్కింగ్ ప్రెసిడెంట్ విప్పాల రాజేందర్ కాంగ్రెస్ జిల్లా నాయకులు అప్పం కిషన్ బుర్ర కొమురయ్య నాయకులు పాల్గొన్నారు