గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో గల చేల్పూర్ గ్రామపంచాయతీ పరిధిలో చేతిపంపు రిపేర్ లో ఉండగా రానున్న ఎండా కాలాన్ని దృష్టిలో ఉంచుకొని అక్కడి ప్రజలకు నీటి కొరత లేకుండా ఎంపీడీవో భాస్కర్ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ కార్యదర్శి హరిచంద్ర రెడ్డి, చేతి పంపు మెకానిక్ గడ్డం బిక్షపతి చేత మరమ్మత్తులు చేయించడం జరిగింది . చేతిపంపు బాగు చేయడంతో అక్కడ నివసించే ప్రజలకు నీటి ఇబ్బంది తొలగిపోతుందని హర్షం వ్యక్తం చేశారు.