భూపాలపల్లి నేటిధాత్రి
యూత్ కాంగ్రెస్ భూపాలపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ యార అజయ్ రెడ్డి
దేశంలోని యువతకు 2 కోట్ల ఇస్తామని చెప్పి మోసం చేసిన బీజేపీ పార్టీని పార్లమెంటు ఎన్నికల్లో ఓడించాలని యూత్ కాంగ్రెస్ భూపాలపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు యార అజయ్ రెడ్డి నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అజయ్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో మళ్ళీ బీజేపీని గెలిస్తే దేశంలోని యువత భవిష్యత్తు అంధకారం అవుతుందని,ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటు పరం చేస్తూ ఉద్యోగావకాశాలు లేకుండా యువతను మోసం చేసిన బీజేపీ పార్టీని ఓడించి నరేంద్ర మోడీకి యువత బుద్ధి చెప్పాలని,కాంగ్రెస్ తోనే యువతకు ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు