వీణవంక, ( కరీంనగర్ జిల్లా),
నేటి ధాత్రి: వీణవంక మండల పరిధిలోని హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన బండారి రాధా అనారోగ్యంతో మృతి చెందగా విషయాన్ని తెలుసుకున్న కొమ్మిడి రాకేష్ రెడ్డి తన అనుచరులను పంపించి మృతురాలు కుటుంబాన్ని పరాపరామర్శించి కుటుంబ సభ్యులకు తన వంతు సహాయంగా 50కేజీల బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రాకేష్ రెడ్డి యువ సైన్యం వ్యవస్థాపకులు సతీష్ కుమార్,నల్ల కొండాల్ రెడ్డి,మద్దుల ప్రశాంత్,గట్టయ్య,మోహన్ రెడ్డి,శ్రావణ్,వంశీ తదితరులు పాల్గొన్నారు.