జర్నలిస్టులకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలి

జేహెచ్ఎస్ కింద కార్పొరేట్, ప్రయివేటు ఆసుపత్రిలో వైద్య సదుపాయం కల్పించాలి

జర్నలిస్టు పిల్లలకు ప్రయివేటు పాఠశాలల్లో ఉచిత విద్యను అందించాలి

___టీ.డబ్ల్యూ.జే.ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, వరంగల్, హన్మకొండ జిల్లాల ఇన్చార్జి ఇ. చంద్రశేఖర్

నేటిధాత్రి, వరంగల్

జర్నలిస్టుల ఇండ్లు, ఇళ్ల స్దలాల కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని టీడబ్ల్యూజెఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, వరంగల్, హన్మకొండ జిల్లాల ఇన్చార్జి ఇ. చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వరంగల్ మహా నగర పాలక సంస్థ ఆవరణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, వరంగల్, హన్మకొండ జిల్లాల ఇన్చార్జి ఈ చంద్ర శేఖర్ మాట్లాడుతూ హనుమకొండ వరంగల్ రెండు జిల్లాల్లో జర్నలిస్టుల సమస్యలపై ఉద్యమించడానికి కార్యాచరణ తీసుకొననున్నట్లు తెలిపారు. ఇందుకోసం తొలుత వరంగల్ జిల్లా ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, అదేవిధంగా మంత్రి కొండ సురేఖ లను కలిసి వినతి పత్రాలు అందజేస్తామన్నారు. గత ప్రభుత్వ పాలనలో జర్నలిస్టులు నిరాధరణకు గురయ్యారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక చోరవ చూపాలన్నారు. జర్నలిస్టులకు నగదు రహిత వైద్య ఆరోగ్య సేవలు అందించడంతో పాటు, జర్నలిస్టు పిల్లలకు ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఉచిత విద్యను అందించాలన్నారు., అసెంబ్లీ నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్దాయిలో జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, ఇండ్ల స్థలాలు కేటాయించాలన్నారు. వరంగల్ నగరంలోని దేశాయిపేటలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను జర్నలిస్టులకు కేటాయిచాలన్నారు. మండలాలో ప్రభుత్వ భూముల్లో ఇండ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం అవుతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వరంగల్, హన్మకొండ జిల్లాలలో అర్హులైన జర్నలిస్టులకు అక్రిడియేషన్ కార్డులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో గుర్తింపు కలిగిన వివిధ పత్రికల ఛానల్ లో జర్నలిస్టులుగా గత కొన్ని ఏళ్లుగా పనిచేస్తున్న చాలామంది దారిద్ర రేఖకు దిగువన ఉండి జీవనం సాగిస్తున్నారు. సామాజిక బాధ్యత కలిగిన జర్నలిస్టులుగా అనేక కథనాల ద్వారా ప్రజలను చైతన్య పరచడమే కాకుండా ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా వ్యవహరిస్తూ వివిధ అధికారిక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలో స్థలాలు పట్టాలు ఇవ్వగలరు అని అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా అధ్యక్షులు పోడేటి అశోక్, హన్మకొండ జిల్లా అధ్యక్షులు టీ వీ రాజు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జక్కుల విజయ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు మచ్చిక వెంకటేశ్వర్లు, ఈర్ల సురేందర్, స్వామిదాస్, కిరణ్, విజయ్ భాస్కర్, రాజేందర్, రాజేష్, అనిల్, సుమన్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!