#మొదటిరోజు వంద శాతం హాజరు.
#కోలాహలంగా పరీక్ష కేంద్రాలు.
#నిర్దిష్ట సమయానికి ముందే విద్యార్థులు హాజరు.
#తగు సూచనలు చేసి పంపిన తల్లిదండ్రులు.
నల్లబెల్లి, నేటి ధాత్రి: మండలంలో గల మూడు పరీక్ష కేంద్రాల వద్ద సోమవారం ప్రశాంత వాతావరణంలో పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి పరీక్ష సమయానికి అరగంట ముందే పరీక్ష కేంద్రాల వద్ద బారులు తీరారు విద్యార్థుల తల్లిదండ్రులు తగు సూచనలు సలహాలు ఇచ్చి పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను సాగనంపారు అదేవిధంగా అధికారులు విద్యార్థుల వద్ద ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించలేదు పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా విద్యుత్, తాగునీరు,మెడికల్ క్యాంప్ వంటి వాటిని ఏర్పాటు చేశారు మూడుపరీక్ష కేంద్రాల్లో బాలురు, బాలికలు కలిసి మొత్తం 392 మంది ఉండగా మొదటి రోజు వంద శాతం విద్యార్థిని విద్యార్థులు హాజరై పరీక్ష రాశారని మండల విద్యాశాఖ అధికారి తెలిపారు అలాగే పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ పర్యవేక్షణలో 144 సెక్షన్ అమల్లో ఉందని కావున విద్యార్థుల తల్లిదండ్రులు బంధువులు దీనిని అతిక్రమించరాదని ఎస్సై రామారావు పలువురికి సూచించారు పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి మాస్ కాపింగ్ జరగకుండా పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.