ప్రకాష్ రెడ్డిని ఆత్మీయంగా సన్మానిస్తున్న క్యాతరాజు సాంబమూర్తి
మొగుళ్ల పల్లి నేటి ధాత్రి న్యూస్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా డిసిసి అధ్యక్షుడిగా సేవలందించిన ఐత ప్రకాష్ రెడ్డి సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనను ట్రేడ్ యూనియన్ కార్పొరేషన్ బోర్డ్ చైర్మన్ గా నియమించారు. కాగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ముఖ్య నాయకుడు క్యాతరాజు సాంబమూర్తి ఆదివారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించి..శుభాకాంక్షలు తెలిపారు. ప్రకాష్ రెడ్డి మరిన్ని ఉన్నతమైన పదవులను అదిరోహించాలని ఆకాంక్షించారు.