మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదు. ఏ పక్షి అయినా ఒక రెక్కతో ఎగరలేదు.
ఎక్కడ స్త్రీలు పూజలందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు (యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత) అని ఆర్యోక్తి. సృష్టికి మూలం స్త్రీ. దేవుడికి ప్రతిరూపం తల్లి. అలాంటి తల్లి తల్లడిల్లి కన్నీరు కారిస్తే అది మనకు మంచిదా? కాదు. సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలం. ఇదే నినాదంతో ఈ రోజున ఆయా రంగాల్లో ప్రముఖ మహిళలు సాధించిన ప్రగతిని స్పూర్తిగా తీసుకొని,
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల కేంద్రం లోని డాక్టర్ బి.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న ఎన్.సుభాషిణి కి, సేవ్ గర్ల్ చైల్డ్ మరియు ముందడుగు ఫౌండషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో సాధికారిక మహిళా అవార్డ్ అందుకున్నారు. ఈ సందర్బంగా, ప్రిన్సిపాల్ డా.అప్పియ చిన్నమ్మ, వైస్ ప్రిన్సిపాల్ డా.శ్రీనివాసులు, అకాడమిక్ కోఆర్డినేటర్ రవీందర్ రావు,బొటనీ అసోసియేట్ ప్రొఫెసర్ డా.సదాశివయ్య సూపర్నెంట్ రవి ఇతర అధ్యాపక అధ్యాపకేతర వర్గం అభినందించారు.