వేములవాడ, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల కొరకు ఎన్నికల అధికారి నోటిఫికేషన్ విడుదల చేయడంతో సోమవారం కోర్టు బార్ అసోసియేషన్ హాల్లో ఎన్నికల వాతావరణం మొదలైంది.. వివిధ పదవులకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగగా, మొదటిరోజు ప్రెసిడెంట్ గా గుడిసె సదానందం, జనరల్ సెక్రటరీ గా అవధూత రజనీకాంత్, కోశాధికారిగా బొడ్డు ప్రశాంత్ కుమార్, జూనియర్ ఈసీ మెంబర్ గా భీమ మహేష్ బాబు, వంశీకృష్ణ లు నామినేషన్ వేసినట్టు బార్ అసోసియేషన్ ఎన్నికల అధికారి కే.విద్యాసాగర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు.