జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
పదవ తరగతి పరీక్షల నిర్వహణలో భాగంగా మౌలిక వసతులు సరిగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా అధికారులను ఆదేశించారు. సోమవారం కొత్తగూడెం సింగరేణి హై స్కూల్ మరియు సెయింట్ మేరీస్ హై స్కూల్ లో జరుగుతున్న పదవ తరగతి పరీక్షల నిర్వహణ ను ఆకస్మికంగా సందర్శించి పరీక్ష వ్రాయు విధానము సరళిని పరిశీలించారు.
పరీక్షకు హాజరైన విద్యార్థుల వివరాలను జిల్లా కలెక్టర్ చీఫ్ సూపర్డెంట్ లను అడిగి తెలుసుకున్నారు. మాస్ కాపీలు జరగకుండా బాధ్యులు పర్యవేక్షించాలని ఇన్విజిలేటర్స్ ను ఆదేశించారు. విద్యార్థులకు కల్పించే మౌలిక సదుపాయాలు పరిశీలించారు. పరీక్ష హాల్లో నిరంతర విద్యుత్ సరఫరా, ఫ్యాన్లు, వెలుతురు మరియు త్రాగునీరు అందుబాటులో ఉండాలన్నారు. పరీక్ష కేంద్రంలో ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు సెల్ ఫోన్లు అనుమతించరాదని, పరీక్ష కేంద్రం సమీపంలో ఇటువంటి జిరాక్స్ సెంటర్లో ఉండరాదని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ ప్రతిష్టంగా అమలు పరచాలని సంబంధిత పోలీసు అధికారులను కలెక్టర్ సూచించారు.
ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు.
ఏ ఒక్కరూ కూడా సెల్ ఫోన్ తో పరీక్ష కేంద్రంలోకి రాకూడదని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పరిశీలించారు. కలెక్టర్ వెంట కొత్తగూడెం ఆర్ డి ఓ మధు, తాసిల్దార్ పుల్లయ్య, తదితర అధికారులు పాల్గొన్నారు.