మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలంలోని తీగలపల్లి, ఇప్పోని బాబి గ్రామంలో మహబూబ్ నగర్ ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థినిలు ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరంలో భాగంగా వారం రోజుల నుండి వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. చివరి రోజు గ్రామంలో ఓటర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఓటు యొక్క విలువ ఓటు దుర్వినియోగం దేశ ప్రగతికి ఏ విధంగా ,ఆటంకం కలిగిస్తుంది మొదలైన విషయాలపై గ్రామంలో ప్రజలకు చైతన్యం కలిగించారు. ముగింపు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాలమూరు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ కే ప్రవీణ విచ్చేసి వారం రోజులపాటు ఎన్ఎస్ఎస్ వాలెంటైర్లు గ్రామంలో చేసిన సేవలను అభినందించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎన్ఎస్ఎస్ చైర్మన్ కెప్టెన్ డాక్టర్ విజయ్ కుమార్, గ్రామ కార్యదర్శి నర్మద,ఎన్ఎస్ ఎస్ పి ఓ ఐ శ్రీవాణి,ఈ శ్రీనివాసులు,జి స్వాతి, హిమనీల పాల్గొన్నారు