పది పరీక్షలకు పక్డ్బందిగా ఏర్పాట్లు.
ఎస్సై అభిషేక్ రెడ్డి.
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా,నవాబుపేట మండల పరిధిలోని పదవ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహిస్తున్నట్లు నవాబుపేట మండల్ ఎస్సై తెలిపారు, అనంతరం ఎస్ఐ, నేటి ధాత్రి ప్రతినిధితో చరవాణిలో మాట్లాడుతూ.పదవ తరగతి పరీక్షలను దృష్టిలో ఉంచుకొని నవాబుపేట మండలంలోని గ్రామాల్లో కేటాయించిన పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద పకడ్బందీ బందోబస్తు చర్యలు చేపడుతున్నామని ఎస్సై అభిషేక్ రెడ్డి తెలిపారు, పరీక్ష కేంద్రాలకు సమీపంలో 144 సెక్షన్ విధించడం జరుగుతుందని చెప్పారు, కావున పరీక్ష కేంద్రాల వద్ద ఎక్కువమంది గుమ్మిగూడ రాదన్నారు, దీంతోపాటు జిరాక్స్ కేంద్రాలు ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని జిరాక్స్ సెంటర్ యజమాన్యులకు తెలిపారు, పరీక్ష కేంద్రాల లోపలికి విద్యార్థులకు, ఇన్విజిలేటర్లు, పరీక్ష పర్యవరణ అధికారులకు మాత్రమే అనుమతి ఉంటుందని గేటు మూసిన తర్వాత లోపలికి వెళ్లే అనుమతి ఉండదన్నారు, పరీక్ష కేంద్రాల వద్ద ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరుగుతే డయల్ 100 లేదా 8712659340 పోలీసులకు ఫిర్యాదు చెయాలని సూచించారు, పరీక్షలు ప్రశాంతంగా ముగిసేంద వరకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు,అదే విధంగా పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు నవాబుపేట పోలీస్ ఎస్సై అభిషేక్ రెడ్డి, విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ తెలిపారు.