-కాంగ్రెస్ పార్టీ లో చేరిన వేములవాడ పట్టణ సెస్ డైరెక్టర్ నామల ఉమా-లక్ష్మీరాజం
-వారి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్
వేములవాడ, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు కొనసాగుతుంది. సోమవారం వేములవాడ మాజీ మున్సిపల్ చైర్మన్, వేములవాడ పట్టణ సెస్ డైరెక్టర్ నామాల ఉమా లక్ష్మీరాజం దంపతులు కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస సమక్షంలో చేరడం జరిగింది. వీరికి ప్రభుత్వం విప్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఘనంగా ఆహ్వానించారు.
వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అందిస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు.
కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం ఆరు గ్యారెంటీలు, అమలు చేస్తుందని పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ద్వారానే న్యాయం జరుగతుందన్నారు.రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గెలుపే లక్ష్యంగా పని చేస్తామన్నారు.