
మాలహర్ రావు, నేటిధాత్రి :
మండలంలోని
కొయ్యూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా ఎలాంటి బిల్లులు లేకుండా తరలిస్తున్నటువంటి రెండు ఇసుక లారీలను కొయ్యూరు పోలీసులు పట్టుకొని డ్రైవర్ మీద, వెహికల్ ఓనర్ మీద కేసు నమోదు చేసి వాహనాలను సీజ్ చేయడంజరిగిందని అదేవిధంగా మల్లారం, తాడిచర్ల గ్రామాల రోడ్డుపై పోసినటువంటి నాలుగు ఇసుక కుప్పలను ఎమ్మార్వోకు అప్పగించడం జరిగింది. ఏటువంటి బిల్లులు లేకుండా దొంగ ఇసుక తరలిస్తే ఎలాంటి వ్యక్తులైన చట్టపరమైన చర్యలు తీసుకొని కేసు నమోదు చేస్తామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అక్రమ ఇసుక స్థలాన్ని సందర్శించిన కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి, సిఐ నాగార్జున రావు, కొయ్యూరు ఎస్సై నరేష్ లు సందర్శించి అంతరం ఈలాంటి చర్యలకు పాలుపడే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించాడం జరిగింది.