రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను టీఎన్జీవో మాజీ అధ్యక్షులు కారం రవీందర్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా శాఖ మాజీ అధ్యక్షులు పరిటాల సుబ్బారావులు కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఎంపీ రవిచంద్ర రాజ్యసభకు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత రవీందర్ రెడ్డి, సుబ్బారావులు హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఆయన నివాసానికి విచ్చేసి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా వారు ఎంపీ వద్దిరాజును శాలువాతో సత్కరించారు.