అక్రమ కట్టడాలకు కొమ్ము కాస్తూ కొత్త ట్రెండుకు శ్రీకారం చుట్టిన దమ్మాయిగూడ మున్సిపల్ అధికారులు..

అంతా మేమే చూసుకుంటామని మేనేజ్ చేస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు……

పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అక్రమ కట్టడాలు: ప్రభుత్వానికి భారీ గండి…..

మేడ్చల్, నేటిధాత్రి:

మేడ్చల్ నియోజకవర్గం, కీసర(దమ్మాయిగూడ) దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని సెట్ బ్యాక్ లు లేకుండా,రోడ్ల లను ఆక్రమించి,అక్రమ కట్టడాలు జరుగుతున్న, కంటికి కనబడేటట్టు అక్రమంగా సెల్లార్లు,పెంట్ హౌస్ లు నిర్మాణం జరుగుతున్న, వంద నుండి 200 గజాల స్థలంలో పరిమితికి మించి నాలుగు, ఐదు అంతస్తుల, భవన నిర్మాణాలు విచ్చలవిడిగా జరుగుతున్న, ఏ ఒక్కరిపై టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు తీసుకోకపోవడమే కాక, అక్రమార్కులతో కుమ్మక్కై ,పనులు ఎట్ల జరుపుకోవాలని ఐడియాలు ఇవ్వడం దమ్మాయిగూడ మున్సిపల్ అధికారులు ఒక కొత్త ట్రెండింగ్ కి శ్రీకారం చుట్టారు.అక్రమ కట్టడాలపై వివిధ పత్రికల్లో పలుమార్లు వార్తలు వచ్చిన, టౌన్ ప్లానింగ్ అధికారులు అన్నిటినీ బేకాతరు చేసి తమ ఇష్టారాజ్యంగా అక్రమార్కులకు వత్తాసు పలికి అడ్డగోలుగా దండుకుంటున్నారు అనే మాట ఎక్కువగా వినపడుతోంది.ఇంత జరుగుతున్నా ఉన్నత అధికారులు కూడా ప్లానింగ్ అధికారులపై నోరు మెదకపోవడం చూస్తుంటే ఎవరికి దక్కాల్సిన వాటలు వారికి దక్కుతున్నాయి అని స్పష్టంగా కనబడుతుంది.ఇది ఇలాగే కొనసాగితే రాను రాను ఎక్కడ చూసినా అక్రమ కట్టడాలు విచ్చలవిడిగా నిర్మాణం జరిగి రోడ్లు,చెరువులు, నాళాలు ఆక్రమానికి గురి అవుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.వీరికి తోడు నాయకుల అండదండలు ఉండడంతో అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది,దమ్మాయిగూడ మున్సిపాలిటీ 9వ వార్డులో ఆర్ సి ఎంక్లేవ్ కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న భవనానికి స్థానికులు మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు అంటే దీని వెనుక రాజకీయ ఒత్తిడి ఉన్నట్టు తెలుస్తుంది.ఇప్పటికైనా నిబంధనల ప్రకారం భవన నిర్మాణాలు చేపట్టే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!