గణపురం నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో అర్టీజన్ గ్రేడ్ 2 కార్మికుడిగా ఎలక్ట్రిసిటీ మేయింటనెన్స్ డివిజన్ రెండవ దశలో పనిచేస్తున్న నాంపల్లి కుమారస్వామి అనారోగ్యం తో మృతిచెందారు గురువారం పెద్దకర్మ 11వ రోజు తోటి ఆర్టీజన్ కార్మికులు ఇంజనీర్లు అందరూ కలిసి 55000 రూపాయలు మృతునికుటుంబానికి అందించారు. ఈ కార్యక్రమంలో అర్టీజన్ కార్మిక నాయకులు చిలువేరు మల్లయ్య, బొమ్మకంటి రాజేందర్, కోల శ్యాం, ఇనుగాల కుమార్, నారదాసు కృష్ణ, సూర శశాంక్ ట్రేడ్ యూనియన్ నాయకులు టిఆర్వికెఎస్ జెన్ కో అధ్యక్షుడు ఎలకంటి రగోత్తం, ఐఎన్ టియూసి నాయకులు మాధవరావు రాజు 1104 కనకరాజు ఇంజనీర్స్ అసోసియేషన్ నుంచి మాకుల సంతోష్ ,రాజు తదితరులు పాల్గొన్నారు