మహబూబ్ నగర్ జిల్లా ::నేటి దాత్రి
రేవంతన్న దండు గా ప్రజా పాలనకు అండగా పాదయాత్ర కార్యక్రమంలో గురువారం రోజు ఏఐసిసి కార్యదర్శి మాజీ ఎమ్మెల్యేఎస్ ఏ.సంపత్ కుమార్ కొల్లాపూర్ నియోజకవర్గంలోని సింగోటం గ్రామం నుండి
బయలుదేరి లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయం వరకు పాదయాత్ర చేసి ప్రత్యేక పూజలు నిర్వహించరు.
మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు ఆదేశానుసారం
అనంతరం కొల్లాపూర్ లో ఖాదర్ వలీ దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించి వారి ఆశీర్వాదం పొందడం జరిగింది .
ఈ కార్యక్రమంలో భాగంగా బాబా సాహెబ్ అంబెడ్కర్, మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించరు.స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ సాధిస్తామని అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో యుద్ధప్రాతిపదికన 6 గ్యారింటీలను అమలు పరుస్తున్నామని అన్నారు.
నాగర్ కర్నూల్ పార్లమెంటు కచ్చితంగా 3 లక్షల పై చిలుకు మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి రాహుల్ గాంధీ ప్రధాని పదవి అధిరోహించడానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నడుం బిగించి పని చేస్తారని అన్నారు .
కొల్లాపూర్ చరిత్రని తిరగరాసి ఇక్కడ గత పాలకుడు అవినీతి మీద అత్యధిక మెజారిటీతో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కృషి చేసిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు వనపర్తి నియోజకవర్గ్ ప్రజలకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలపడం జరిగింది.
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కచ్చితంగా 10 పై చిలుకు స్థానాలు గెలిచి సోనియా గాంధీ కి, రేవంత్ రెడ్డి నాయకత్వంలో కానుకగా ఇస్తామని అన్నారు.