రామకృష్ణాపూర్, మార్చి 14 ,నేటిధాత్రి:
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల రెండో వార్డు జ్యోతి నగర్ లోని చర్చి లైన్ లో రెండు లక్షల మున్సిపల్ జనరల్ ఫండ్ నిధులతో సీసీ రోడ్డు పనులను చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ ఆదేశాల మేరకు వార్డు కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్ ఆధ్వర్యంలో గురువారం పనులు ప్రారంభించారు. సీసీ రోడ్డు పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి పుర చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి,కమిషనర్ మురళీకృష్ణ హాజరయ్యారు.ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, పిసిసి జనరల్ సెక్రెటరీ రఘునాథ్ రెడ్డి, డిసిసి అధికార ప్రతినిధి ఒడ్నాల శ్రీనివాస్, మహంకాళిశ్రీనివాస్,మందమర్రి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపతి రాజయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అబ్దుల్ అజీజ్, పుల్లూరి కళ్యాణ్,కౌన్సిలర్లు పనాస రాజు లు పాల్గొన్నారు. ప్రారంభించారు.అభివృద్ధి పనుల్లో భాగంగా సిసి రోడ్డు పనులు ప్రారంభించామని, రానున్న రోజులలో అన్ని వార్డులలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతాయని చైర్ పర్సన్ జంగం కళ అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బింగి శివ కిరణ్, ఎర్రబెల్లి రాజేష్, పలిగిరి కనకరాజు,మేకల రమేష్ యాదవ్, ఆకుల రాజన్న,గంగారాపుసత్యపాల్, ఆర్నె సతీష్, జంగంపల్లి మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.