నేటిధాత్రి, వరంగల్ తూర్పు
వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, వరంగల్ తూర్పు పరిధిలోని మట్టేవాడ పోలీసుల ఆధ్వర్యంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ చేశారు. వివరాల్లోకి వెళితే వరంగల్ ఎస్వియన్ రోడ్డులో గల మట్టెవాడ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న 100మంది విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు, నోట్ బుక్స్, పెన్సిల్లు, పెన్నులు, స్కేల్ లు వరంగల్ ఏసిపి చేతుల మీదుగా విద్యార్థులకు అందచేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఏసిపి నందిరాం నాయక్, మట్ట్వాడ సీఐ తుమ్మ గోపి, ఎస్ఐ లు, స్కూల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.