మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జాతీయ సేవా పథకం వాలంటీర్లు నవాబుపేట మండలంలోని తీగలపల్లి ఇప్పుని బావి గ్రామాలలో ఏడు రోజుల ప్రత్యేక శిబిరంలో భాగంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గురువారం రోజు ఇంటింటికి సర్వే చేపట్టారు.ఈ సర్వేలో కుటుంబ సభ్యుల వివరాలు అక్షరాస్యత మరుగుదొడ్ల సౌకర్యం ఇంకుడు గుంతలు పింఛన్ అంగన్వాడి సౌకర్యాలు మొదలైన వివరాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ పిఓలు ఐ శ్రీవాణి, ఈ శ్రీనివాసులు, జి స్వాతి, హిమనీల, పంచాయతీ కార్యదర్శి నర్మదా, వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ శిబిరాన్ని డిస్టిక్ ఎన్వైసీ ప్రెసిడెంట్ కోటా నాయక్ తదితరులు సందర్శించారు.