జోడు వాగుల నూతన బ్రిడ్జి,రోడ్డు కోసం సిపిఎం పాదయాత్ర
భీమారం, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా భీమారం జోడు వాగుల నూతన బ్రిడ్జి,రోడ్డు సాధనకై మంగళవారం రోజు సిపిఎం పార్టీ నాయకులు పాదయాత్ర నిర్వహించారు. వారికి మద్దతుగా ప్రజా సంఘాలు, స్థానికులు వారి సంఘీభావాన్ని తెలుపుతూ
భీమారం తహశీల్దార్ కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సంకె రవి మాట్లాడుతూ భీమారం మండలంలోని జోడువాగుల వద్ద ఉన్న బ్రిడ్జి శిధిలావస్థలోకి చేరి ప్రమాదకరంగా మారిపోయిందని,
మరో ప్రక్క రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు పడి ప్రయాణికులకు ప్రమాదాలు జరిగి గాయలపాలౌతున్నారని,అనేక మంది మరణించడం కూడా జరిగిందని,
ఇంత ఘోరం కండ్ల ముందు కన్పిస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని,
8 సంవత్సరాలుగా మదుకాన్ కాంట్రాక్టు సంస్థ యాజమాన్యం జోడు వాగు నూతన రోడ్డు,బ్రిడ్జి నిర్మించడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందని,ఇందారాం ఎక్స్ రోడ్డు నుంచి సిరోంచ వరకు వేసిన రోడ్డు లో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్ల రోడ్డు చెడిపోయిందని,మరో ప్రక్క ఏర్పాటు చేసిన వీది లైట్లు వెలగకపోవడం చూస్తుంటే రోడ్డు కాంట్రాక్టర్లు ఎంత శ్రద్ధతో పనిచేశారో తెలుస్తుందని,
జిల్లా అధికారులు,ఎమ్మెల్యే జోక్యం చేసుకొని జొడువాగుల వద్ద నూతన బ్రిడ్జి నిర్మాణం చేసి,రోడ్డు వెయ్యాలని ప్రమాదాల్లో గాయపడ్డ మరియు మరణించిన వారి కుటుంబాలకు తప్పకుండా నష్టపరిహారం ఇవ్వాలని,
నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టు సంస్థపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సంకే రవి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి, దాసరి రాజేశ్వరి, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు,బోడంకి చందు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు, సిపిఎం నాయకులు ఉమారాణి, సమ్మక్క,చంద్రన్న, నాగేష్, కావిరి రవి సిపిఎం కోటపల్లి మండల కార్యదర్శి, పాదయాత్రకు మద్దతుగా వచ్చిన సంఘాలు సిఐటియూ నాయకులు దుంపల రంజిత్, గోమాస ప్రకాష్, దూలం శ్రీనివాస్, దేవి సత్యం సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు, సిద్ధార్థ సమతా సైనిక్ దల్, ఐద్వా నాయకులు నిర్మల,నాగజ్యోతి యామిని,సరిత, ఎస్ఎఫ్ఐ శ్రీకాంత్, అభినవ్, అరవింద రెడ్డి, డివైఎఫ్ఐఅనిల్, కెవిపిఎస్ మోహన్, కుమార్, అశ్విని, మధు, గిరిజన సంఘం సమ్మక్క,బుదక్క,గావిడి సరిత,సుజాత, డుబ్బుల కొలుపు కళాకారుల సంఘం రమాదేవి,రాజేశ్వరి రైతు సంఘం రాజన్న,బొందయ్య, వెంకటస్వామి, మధు నక్క, సునీత, తదితరులు పాల్గొన్నారు.