పాలకుర్తి నేటిధాత్రి
పాలకుర్తి మండల కేంద్రంలోని మిషన్ భగీరథ గెస్ట్ హౌస్ లో రైతులకి ధర్మ సాగర్ రిజర్వాయర్ నుండి నీళ్లు విడుదల పై ప్రెస్ మీట్ నిర్వహించిన స్థానిక శాసన సభ్యులు శ్రీమతి యశస్విని ఝాన్సి రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి మాట్లాడుతూ, ధర్మసాగర్ రిజర్వాయర్ నుండి నీళ్లు విడుదల అయ్యాయి. కండ్లు తెరిచి చూస్తే కనపడుతాయి అసత్య ప్రచారాలు మానుకోండి ప్రజలు తిరస్కరించిన మీ తీరు మారట్లేదు. రేపు ఉదయం వరకు నీళ్లు అందిస్తాం, రైతులేవరు ఆందోళన చెందోద్దు సాగు నీరు అందించే బాధ్యత మాది, ప్రతిపక్షాల మాటలు నమ్మకండి, రేపు ఉదయం వరకు కచ్చితంగా నీరు అందుతుంది ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి. మాజీ మంత్రి ఎర్రబెల్లి నీళ్లు వచ్చే విషయం తెలుసుకొని కావాలని ఫోన్ లో పోజులు కొడుతున్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వానికి పది సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు రైతుల మీద గతంలో లేని ప్రేమ ఇప్పుడే గుర్తొచ్చిందా అని వాక్యానించారు. ప్రజల కోసం పని చేసే కాంగ్రెస్ ప్రభుత్వం పై ధర్నాలు, రాస్తారోకోలు చేసి బిఆర్ఎస్ పార్టీ వాళ్లు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. మా ప్రభుత్వం ప్రజలకోసం ఎన్నుకోబడిన ప్రభుత్వం, కంకణం కట్టుకొని బదనాం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. అనంతరం అధికారులతో రివ్యూ నిర్వహించి సాగు నీటిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు రైతులు ఎవరు ఇబ్బందులకు గురికాకూడదని, అధికారులు అప్రమతంగా ఉండాలని అన్నారు.