ఇంటి పన్ను వసూలు చెయ్యండి

మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్ర రెడ్డి

నాగారం నేటి దాత్రి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా

నాగారం మున్సిపల్ కార్యాలయంలో వార్డు ఆఫీసర్లు బిల్ కలెక్టర్లతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో చైర్మన్ కౌకుంట్ల చంద్ర రెడ్డి మాట్లాడుతూ 2023-2024 ఆర్థిక సంవత్సరం ఇంటి పన్నులు మరియు ట్రేడ్ లైసెన్స్ 100% వసూలు చేయాలని బిల్ కలెక్టర్లకు మరియు లైసెన్స్ ఇన్స్పెక్టర్ కు ఆదేశించడం జరిగింది . ఇందులో భాగంగా 2023- 24 ఆర్థిక సంవత్సరము ఇంటి పన్ను బకాయి ఉన్నవారికి రెడ్ నోటీస్ జారీ చేయాలని బిల్ కలెక్టర్లకు ఆదేశించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జి.రాజేంద్రకుమార్ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!