https://epaper.netidhatri.com/
తెలంగాణను కదిలించింది ఈటెల!
విద్యార్థులకు అండగా నిలిచింది ఈటెల.
ఉద్యమం కోసం ఆస్థులు కోల్పోయింది ఈటెల.
ఉద్యమ కారులను కడుపులో పెట్టుకున్నది ఈటెల.
ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రాణాలను లెక్క చేయకుండా ప్రజలను కాపాడిరది ఈటెల.
బడుగుల నేత ఈటెల.
భవిష్యత్తు తెలంగాణకు సాక్ష్యాలు.
తెలంగాణ అంటేనే ఈటెల గుండెకాయ.
ఉద్యమ వాసన లేని వాళ్లు ఈటెలను ప్రశ్నించడమా!
ఈటెలవి త్యాగాల పునాదులు. రేవంత్ వి రాజకీయ భవంతులు.
బిజేపిని ప్రశ్నించలేక, ఈటెలను టార్గెట్ చేస్తున్నారు.
దమ్ముంటే బిజేపిని తూర్పారపట్టండి!
ధైర్యం వుంటే బిజేపి ప్రశ్నించండి.
వేలెత్తి చూపడానికి బడుగులే దొరికారా!
బడుగుల రాజకీయాలను చిదిమేయాలనుకుంటున్నారా!
అధికారంలో వున్నవారికి ఓపిక ఎంతో అవసరం. మాట పొదుపు ఎంతో మేలు. అందుకే మనం ఏం మాట్లాడుతున్నాం? ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ఎంత మాట్లాడుతున్నాం? ఎందుకు మాట్లాడుతున్నాం? సందర్భమేమిటి? అవతలి వ్యక్తికి వున్న పేరేమిటి? అన్నది బాగా గుర్తెరిగి మాట్లాడాలి. అందులోనూ ముఖ్యమంత్రి పదవిలో వున్నవారు ఎంత పొదుపైన, ఇంపైన మాటలు మాట్లాడితే ప్రజలు అంత స్వాగతిస్తారు. కోపం వుంది కదా? అని రాజకీయ ప్రత్యర్థులపై మాటల దాడిలో బూతులు మంచివి కాదు. వారిని ఎదుర్కొవడంలో అడ్డదిడ్డమైన మాటలు అసలే మంచివి కాదు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరింత ప్రస్టేషన్లో మాట్లాడుతున్నట్లున్నారు. ఆయన మాటలు కాంగ్రెస్ నేతలకు కూడా నచ్చడం లేదంటున్నారు. అటు కేసిఆర్‌ను, ఇటు కేటిఆర్‌ను, హరీష్‌రావును, చివరకు మహిళ అని కూడా చూడకుండా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఎవరూ ఊహించని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది నిజంగా ఆయన రాజకీయ భవిష్యత్తుకు కూడా మంచిది కాదు. ఏదైనా వుంటే సైద్దాంతికంగా మాట్లాడితే బాగుంటుంది. మైకు పట్టుకుంటే రేవంత్‌రెడ్డి ఏం మాట్లాతున్నాడో అర్ధం కాకుండా పోతోందని అంటున్నారు. మొన్నామధ్య ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా సంప్రదాయాలను పాటించారు. అభివృద్ధి పనులకు హజరయ్యారు. ఇంత వరకు బాగానే వుంది.
దేశంలో వున్న జాతీయ పార్టీలు రెండే. ఒకటి బిజేపి. రెండు కాంగ్రెస్. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలన్న పట్టుదలతో కాంగ్రెస్ వుంది. దేశమంతా భారత్ జోడో యాత్ర పేరుతో రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటికే దక్షిణాదిన పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు ఉత్తరాధిన సాగుతోంది. ఇలాంటి సమయంలో సందుదొరికితే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బిజేపిని చెడుగుడు ఆడుకోవాలి. కాని భవిష్యత్తులో మాకు సహకారం కావాలి. తెలంగాణ మీద కరుణ వుండాలని సరిగ్గా ఎన్నికల ముందు కేంద్రం ముందు మోకరిల్లడం అంటే అంతర్ధామేమిటి? బాగా ఆలోచిస్తే కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి రాదన్న సంకేతాలు పరోక్షంగా పంపినట్లు కాదా? ఇలాంటి వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు తీరని నష్టం కాదా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి మాట్లాడే ప్రతి మాట ఆచి తూచి మాట్లాడాలి. రేవంత్‌రెడ్డి లాంటి నాయకులు మాట్లాడితే ఆయాచితంగా మాట్లాడారని అనుకుంటారా? ఎందుకంటే ఏ నాయకుడైనా సభకు వెళ్లే ముందు ఏం మాట్లాడాలన్నదానిపై ముందే ఒక ఆలోచనతో స్పష్టతతోనే వెళ్తారు. అవే మాట్లాడతారు. ఇక్కడ కూడా రేవంత్ అలా మాట్లాడినట్లే అన్న చర్చ అటు కాంగ్రెస్‌లోనూ, ఇటు ఇతర రాజకీయ పార్టీలలోనూ సాగింది.
ఈ విషయం కాంగ్రెస్‌పార్టీ జాతీయ నాయకత్వం దాకా వెళ్లిందంటున్నారు. దాంతో బిజేపిని విమర్శించి కవర్ చేసుకోవాలన్న ఆలోచనతో ఈటెల రాజేందర్‌ను టార్గెట్ చేసినట్లున్నారన్న చర్చకు దారి తీసింది. రాజేందర్‌పై రేవంత్‌రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలు పంచు డైలాగ్‌లకు చప్పట్లు కొడుతున్నారు కదా? అని ఏది పడితే అది మాట్లాడితే ఓట్లేసేది ప్రజలు. అందువల్ల . ప్రజల ఆలోచన విదానానికి అనుగుణంగా మాత్రమే నాయకులు మాట్లాడాలి. ఈ మధ్యే రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్న మరికొన్ని మాటలు కూడా అనేక వివాదాలకు దారి తీశాయి. జేబుల్లో కత్తెర్లు పెట్టుకొని తిరుగుతున్నామని సిఎం. రేవంత్‌రెడ్డి అన్నారు. అందుకు కౌంటర్‌గా జేబుల్లో కత్తెర్లు ఎవరు పెట్టుకొని తిరుగారతంటూ ఎదురు ప్రశ్న వేసి హేళన చేశారు. పేగులు మెడలేసుకొని తిరుగుతాం? అనడం వంటివి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తగదు. కార్యకర్తలు మానవబాంబులౌతారు? అనడం దేనికి సంకేతం. శాంతి భద్రతలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి అలాంటి వ్యాఖ్యలు పంపడం దేనికి సంకేతమో? చెప్పాలని బిఆర్‌ఎస్ ప్రశ్నిస్తోంది. అదే సామాన్య ప్రజలో, ప్రతిపక్ష నేతలో మాట్లాడితే ప్రభుత్వం ఊరుకుంటుందా? అని ప్రశ్నిస్తున్నారు. అందుకే రేవంత్‌రెడ్డి లాంటి వారు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం వుంటుంది. తాజాగా యాదగిరి గుట్టకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం పర్యటన కూడా వివాదాస్పమౌతోంది. ప్రతి చోట వివాదాలు మూటగట్టుకుంటూ వెళ్లడం కూడా మంచిది కాదు. ఇక ఈటెల రాజేందర్ లాంటి నాయకుడిపై మాట్లాడేముందు రాజకీయాలు మాట్లాడితే బాగుంటుంది. ఈటెలను ఉద్దేశించి పార్టీపరమైన అంశాలు ప్రస్తావిస్తే ఎంతో హుందాగా వుంటుంది. అంతే కాని పక్కనే పది, పదిహేనేళ్లుగా ఇక్కడే వుంటున్నా, ఏనాడైనా ఈటెల రాజేందర్ వచ్చాడా? ఇప్పుడు ఎందుకు వస్తున్నాడని అనడంలో ఔచిత్యమేమీ లేదు. గతంలో ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు పగ తీర్చుకున్నట్లుగా తప్ప, రాజకీయం ఏమీ కనిపించడం లేదు. మంత్రి మల్లారెడ్డి పై కూడా ఇలాంటిదే సాగుతోందన్నది వినిపిస్తున్న మాట. కాని ఈటెల రాజేందర్ విషయంలో కూడా రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు సరైనవి కాదు.
ఎందకంటే ఈటెల రాజేందర్ తెలంగాణ ఉద్యమకారుడు. ఆయన ఒక ప్రాంతానికి, ఒక నియోజకవర్గానికి పరిమితమైన నాయకుడు కాదు. అందుకే మనం ఎవరిని తిడుతున్నామన్నది గుర్తెరిగి మాట్లాడాలి. తెలంగాణ ఉద్యమ పర్యంతం ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో కూడా గడిపిన నాయకుడు. అక్కడే చదువుకున్న విద్యార్ధి. సమాజాన్ని అక్కడే చదువుకున్నాడు. సమాజ చైతన్యం కోసం అక్కడి నుంచే ఉద్యమ ప్రస్ధానం మొదలుపెట్టాడు. తెలంగాణ ఉద్యమంలో తన పోరాట పటిమ ఎంతదో చూపించాడు. తెలంగాణ అంతా ఏకం చేయడంలో ఈటెల రాజేందర్ పాత్రను ఎవరూ తక్కువ చేయలేరు. ఎందుకంటే ఈటెల రాజేందర్‌ది త్యాగాల చరిత్ర. ఆ మాట ఇప్పటి తరానికి అర్దం కాకపోవచ్చు..తెలంగాణ ఉద్యమంలో లేని వారికి తెలియకపోవచ్చు. ఆయనంటే నచ్చని వారికి గిట్టకపోవచ్చు. కాని ఎన్ని తరాలైనా తెలంగాణ సమాజం ఈటెలను గుర్తుంచుకుంటుంది. గుండెల్లో పెట్టుకుంటుంది. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు పనిచేసినా, తెలంగాణ ఉద్యమాకారులకే చరత్రలో చోటు దక్కింది. ఆ విషయం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలుసుకోవాలి. చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. అదృష్టం రేవంత్‌రెడ్డిని వరించింది. రాదనుకున్న తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణలో రెండో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అయ్యారు. తెలంగాణ ఉద్యమమే లేకపోతే, ఈటెల రాజేందర్ లాంటి వాళ్లే ఉద్యమం చేయకపోతే, తెలంగాణ వచ్చేదా? ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశంలో వుంటే రేవంత్‌రెడ్డి ఈ జన్మలో ముఖ్యమంత్రి అయ్యేవారా?
తెలంగాణ ఉద్యమంలో విద్యార్ధి లోకానికి అండగా నిలిచింది ఈటెల రాజేందర్. తెగించి కొట్లాడిన ఎంతో మంది విద్యార్ధులను కడుపులో పెట్టుకొని చూసుకున్న నాయకుడు ఈటెల రాజేందర్. వాళ్ల జీవితాలను కాపాడిరది రాజేందర్. ఈటెల రాజేందర్ లాంటి వారు కాపాడకపోతే ఎంతో మంది ఉద్యమకారులు ఆనాడు పోలీసుల చేతుల్లో నరకం అనుభవించేవారు. ఎక్కడ ఉద్యమ కారులను పోలీసులు పట్టుకెళ్లినా, ఉద్యమ కారులకు ఏ నష్టం జరక్కుండా అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా, అవసరమైతే ఆదిలాబాద్ ప్రాంతానికైన వెళ్లి వారిని రక్షించుకున్న చరిత్ర ఈటెలది. అలాంటి ఈటెల రాజేందర్ మేడ్చల్ ప్రజలను ఓట్లు అడడగం తప్పని అనడం నైతికం కాదు. ఈటెల రాజేందర్ బిజేపిలో వున్నంత మాత్రాన ఆయన చీదరించుకోవాల్సిన వ్యక్తి కాదు. ఆయన వ్యక్తిత్వాన్ని అలా కించపర్చకూడదు. రాజకీయంగా విమర్శలు చేయండి. ఈటెల రాజేందర్ నాయకుడుగా వున్న పార్టీపై విమర్శలు చేయండి. తెలంగాణ సమాజం కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పదు. ఉద్యమ కాలంలో ఎలాగైతే త్యాగాలు చేశారో..ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటెల రాజేందర్ ప్రాణాలకు తెగించి పనిచేశారు. కరోనా కాలంలో ఆయన చేసిన సేవలు తెలంగాణ సమాజం మర్చిపోలేదు. అలాంటి నాయకుడిని ఎవరు తప్పు పట్టినా, ఆయనను చిన్నగా చేసి మాట్లాడినంత మాత్రాన అవతలి వారి గౌరవం పెరగదు. ఇది ఎవరైనా తెలుసుకోవాల్సిన విషయం.